తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒక్క రోజులోనే ప్రియాంక వయసులో పాతికేళ్ల మార్పు! - ప్రియాంక చోప్రా కొత్త సినిమా

నటి ప్రియాంక చోప్రా.. తను నటించిన 'ద స్కై ఈజ్ పింక్' సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన నటనకు బాలీవుడ్​ శిక్షణాలయమని చెప్పింది.

నటి ప్రియాంక చోప్రా

By

Published : Oct 11, 2019, 10:40 AM IST

గ్లోబల్​ స్టార్ ప్రియాంక చోప్రా.. దాదాపు మూడేళ్ల తర్వాత బాలీవుడ్​ సినిమా 'ద స్కై ఈజ్ పింక్'లో నటించింది. ప్రచారంలో భాగంగా చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

నటి ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూ

"ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే నిజజీవిత కథ ఆధారంగా రూపొందించారు. ఇందులోని నా పాత్ర ఛాలెంజింగ్​గా అనిపించింది. నటిగా రాణిస్తున్నానంటే కారణం బాలీవుడ్​ ఇండస్ట్రీ. అక్కడే మొత్తం నేర్చుకున్నాను. అది నా శిక్షణాలయం" -ప్రియాంక చోప్రా, నటి

ఈ సినిమా షూటింగ్​లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది నటి ప్రియాంక.

"షూటింగ్​లో నా పాత్రకు సంబంధించి పెళ్లి, అంత్యక్రియల సన్నివేశాలను ఒకేరోజు చిత్రీకరించారు. 25 ఏళ్ల వ్యత్యాసంతో ఉన్న ఈ సీన్లలో నటించడం ఛాలెంజింగ్​గా అనిపించింది." -ప్రియాంక చోప్రా, నటి

ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్, జైరా వాసీం, రోహిత్ షరఫ్​ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సోనాలి బోస్ దర్శకత్వం వహించారు. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం.

ఇది చదవండి: భార్యాభర్తల అనుబంధం 'ద స్కై ఈజ్‌ పింక్‌' ట్రైలర్

ABOUT THE AUTHOR

...view details