తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియాంక చోప్రాకు క్రేజీ ఛాన్స్​.. హాలీవుడ్​ స్టార్​ హీరోతో కలిసి.. - ఆంథోని మాకీ

Priyanka Chopra: గ్లోబల్​ స్టార్​ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్​లో మరో ఛాన్స్​ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఆంథోని మాకీతో కలిసి 'ఎండింగ్‌ థింగ్స్‌' అనే సినిమాలో నటించనుందని సమాచారం.

Priyanka Chopra
ప్రియాంక చోప్రా

By

Published : Feb 4, 2022, 7:14 AM IST

Priyanka Chopra: హాలీవుడ్‌లో వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది నటి ప్రియాంక చోప్రా. ఇటీవలే 'ది మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌'తో అలరించిన ఈ గ్లోబల్‌ నటి.. ప్రస్తుతం 'సిటాడెల్‌' అనే అమెజాన్‌ సిరీస్‌తో బిజీగా ఉంది. ఇప్పుడీ భామ మరో క్రేజీ ఆఫర్‌ అందుకున్నట్లు తెలిసింది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఆంథోని మాకీతో కలిసి 'ఎండింగ్‌ థింగ్స్‌'లో నటించనుంది. కెవిన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

ప్రియాంక చోప్రా

జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన యాక్షన్‌ కామెడీ సినిమా 'ట్రూ లైస్‌' తరహాలో ఉండనుందని సమాచారం. నేర సామ్రాజ్యం నుంచి బయట పడాలనుకునే ఓ మహిళ కథలా ఉంటుందని తెలిసింది. దీన్ని డెవిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇన్‌స్పైర్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌, మాకీస్‌ మేక్‌ ఇట్‌ విత్‌ గ్రేవీ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఆంథోని మాకీ 'యాంట్‌ మ్యాన్‌', 'అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌', 'అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌' లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి సినీ ప్రియుల్ని మెప్పించారు.

ప్రియాంక

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details