తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియాంకతో త్వరలో పరిణీతి చోప్రా సినిమా! - jabariya jodi

బాలీవుడ్​లో హీరోయిన్ ప్రియాంక చోప్రా దేశీగర్ల్ అని చెప్పింది కథానాయిక పరిణీతి చోప్రా. ఆమెతో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. పరిణీతి నటించిన 'జబారియా జోడీ' ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రియాంకతో త్వరలో పరిణీతి చోప్రా సినిమా..!

By

Published : Jul 12, 2019, 7:23 PM IST

బాలీవుడ్'దేశీ గర్ల్' ప్రియాంక చోప్రాతో తనకు పోటీ పడాలనే ఉద్దేశం లేదని​ హీరోయిన్ పరిణీతి చోప్రా చెప్పింది. తన తర్వాతి చిత్రం 'జబారియా జోడీ'లోని పాట విడుదల కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసింది పరిణీతి. సంజీవ్ ఝా తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

"బాలీవుడ్​లో ప్రియాంక మాత్రమే దేశీ గర్ల్. నేను ఆమెతో పోటీ పడేందుకు ప్రయత్నించను. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. జబారియా జోడీ చిత్రంలో హీరో సిద్దార్థ్, నేను పూర్తి దేశీ లుక్​లో కనిపించనున్నాం" -పరిణీతి చోప్రా, హీరోయిన్

హీరోయిన్ పరిణీతి చోప్రా

'దోస్తానా' సినిమాలో దేశీగర్ల్ పాటలో అలరించింది ప్రియాంక. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం హీరోలుగా నటించారు.

భవిష్యత్తులో ప్రియాంకతో నటించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నకు అవుననే సమధానమిచ్చింది పరిణీతి.

"ఈ మధ్యే చెప్పా, ఎవరైనా నిర్మాతలు, దర్శకులు మా ఇద్దరితో యాక్షన్ సినిమా తీసేందుకు ముందుకు వస్తే నటించేందు సిద్ధంగా ఉన్నా. ఇంతకు ముందే ప్రియాంక, నేను మాట్లాడుకున్నాం. సరైన స్క్రిప్ట్ రావడమే తరువాయి." -పరిణీతి చోప్రా, హీరోయిన్

ఇది చదవండి: హృతిక్​కు విద్యార్థుల డ్యాన్స్​ ఛాలెంజ్​..!

ABOUT THE AUTHOR

...view details