ఎన్నో హిట్ చిత్రాల్లో నటిగా బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న తార ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌కు చెందిన పాప్ సింగర్ నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. ప్రస్తుతం అక్కడి చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ కొన్ని అంతర్జాతీయ పత్రికలు ఆమెను నిక్ సతీమణిగానే అభివర్ణించడంపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు మాత్రమే ఎప్పుడూ ఎందుకు ఇలా జరుగుతుంది?అని ఆమె ఆవేదన చెందారు.
ప్రస్తుతం ప్రియాంక 'మ్యాట్రిక్స్ రిజరాక్షన్స్' (Matrix Resurrections) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సైన్స్ ఫిక్షన్, యాక్షన్ డ్రామా కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ప్రియాంక.. సినిమాపై ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అంతర్జాతీయ మీడియా పలు వార్తలు ప్రచురించింది.