తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దిల్లీలో షూటింగ్ చాలా కష్టంగా ఉంది' - masked priyanka chopra shoots in delhi

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దిల్లీ కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ షూటింగ్ చేయడం చాలా కష్టంగా ఉందంటూ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

ప్రియాంక

By

Published : Nov 4, 2019, 12:44 PM IST

దిల్లీ కాలుష్యం గురించి చాలా ఆందోళనగా ఉందంటుంది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. తన కొత్త సినిమా షూటింగ్​ కోసం దిల్లీ వెళ్లిన ఈ భామ కాలుష్యాన్ని తట్టుకోలేకపోతున్నా అంటూ ముఖానికి మాస్క్​ ధరించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టింది.

ప్రియాంక చోప్రా

"షూట్​ డేస్ ఫర్ ది వైట్​ టైగర్. ఇక్కడ షూటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలిక్కడ ఎలా జీవించాలో అర్థం కావట్లేదు. ఎయిర్​ ఫ్యూరిఫయర్స్​, మాస్క్​లు మమ్మల్ని బతికిస్తున్నాయి. ఇళ్లు లేని నిరాశ్రయుల కోసం ప్రార్థిస్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి."
-ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నటి

మ్యాన్ బుకర్ ప్రైజ్ సాధించిన అరవింద అడిగా పుస్తకం 'ది వైట్ టైగర్' ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రమిన్ బహ్రాని దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇవీ చూడండి.. ఉగాదికి వైలెన్స్​తో వస్తున్నా: నాని

ABOUT THE AUTHOR

...view details