తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాజ్​కుమార్​ రావుతో తొలిసారిగా ప్రియాంక చోప్రా - ది వైట్​ టైగర్​

'ద వైట్​ టైగర్'​ పుస్తకం ఆధారంగా రూపొందనున్న సినిమాలో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా.. తొలిసారిగా రాజ్​కుమార్ రావుతో కలిసి నటించనుంది.

రాజ్​ కుమార్​ ర్రావ్, ప్రియాంకా చోప్రా

By

Published : Sep 4, 2019, 4:41 PM IST

Updated : Sep 29, 2019, 10:30 AM IST

బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా.. ఆసక్తికర, నిజజీవిత కథలో నటించేందుకు సిద్ధమైంది. 'ద వైట్​ టైగర్'​ పుస్తకం ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాజ్​ కుమార్​ రావు ప్రధాన పాత్ర పోషించనున్నాడు. నెటిఫ్లిక్స్​తో పాటు ముకుల్ ధియోరా, ప్రియాంక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నటించడంపై ఆనందం వ్యక్తం చేసిందీ భామ.

"ద వైట్ టైగర్' పుస్తకంలో కథను చెప్పిన విధానం ఎంతో నచ్చింది. దర్శకుడు రమిన్​ బహ్రానితో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. చిత్రీకరణతో పాటు నటుడు రాజ్​ కుమార్​ రావు​తో తొలిసారి నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా". -ప్రియాంక చోప్రా, నటి

'ద వైట్​ టైగర్​' కథ..

టీ అమ్ముకునే ఓ వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి, విజయవంతమైన వ్యాపారవేత్తగా మారే ప్రయాణమే ఈ పుస్తక కథాంశం. అరవింద్​ అడిగా రచయిత.

ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్​లో భాగమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు రాజ్​కుమార్ రావు. 'ఫారన్​హీట్​ 451', '99 హోమ్స్​'లతో ఆకట్టుకున్న రమీన్​ బహ్రాని.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భారత్​లో త్వరలో చిత్రీకరణ మెుదలుకానుంది.

ఇదీ చూడండి: తప్పుగా ప్రవర్తిస్తే.. తిక్క వస్తుంది: సింగర్ స్మిత

Last Updated : Sep 29, 2019, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details