బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. 'క్వాంటికో' సిరీస్‌తో హాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్‌లోనూ కథానాయికగా రాణిస్తున్నారు. హాలీవుడ్‌లో నటిగా రాణిస్తున్న తరుణంలోనే తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జొనాస్‌తో పరిచయం ఏర్పడడం.. ప్రేమ.. అనంతరం పెద్దల అంగీకారంతో వీరిద్దరూ 2018లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.
లండన్ వీధుల్లో ప్రియాంక-నిక్ గొడవ! - priyanka chopra latest movie
ప్రియాంక చోప్రా తన భర్తను కారు నుంచి దిగిపొమ్మని చెప్పింది. లండన్ వీధుల్లో భార్యభర్తల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంతకీ అక్కడ ఏమైదంటే?
తన భర్త నిక్‌పై ఎంతో ప్రేమతో ఉండే ప్రియాంక ఉన్నట్లుండి తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో లండన్ వీధుల్లో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది! అయితే, ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ప్రియాంక-నిక్ గొడవపడింది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో. ప్రస్తుతం ప్రియాంక తన తదుపరి ప్రాజెక్ట్ 'టెక్ట్స్ ఫర్ యూ' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో నిక్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ సంబంధించిన కొన్ని సన్నివేశాలను లండన్‌లో చిత్రీకరించారు. ఇందులో భాగంగానే కారులో ప్రయాణిస్తున్న ప్రియాంక-నిక్ గొడవపడడం.. అనంతరం నిక్‌ను తన కారు నుంచి దిగిపొమ్మని ఆమె గట్టిగా చెప్పడం.. లాంటి సీన్లు షూట్ చేశారు.