నటిగా, సామాజిక కార్యకర్తగా, యునిసెఫ్ ప్రచారకర్తగా పలు బాధ్యతలను నిర్వర్తించిన నటి ప్రియాంక చోప్రా తన మనసులో మాట బయటపెట్టింది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని ఇటీవలే జరిగిన ఓ ముఖాముఖిలో చెప్పింది.
"రాజకీయంతో సంబంధముండే విషయాలు
మాకు నచ్చవు. కానీ మేం మార్పు తేవాలనుకుంటున్నాం. భారతదేశ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నా. నా భర్త నిక్‌ను అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నా." -ప్రియాంక చోప్రా, నటి