తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దిల్లీ కాలుష్యంపై ప్రియాంక ఆవేదన - priyanka chopra pollution

దిల్లీ కాలుష్యంపై స్పందించింది ప్రియాంక చోప్రా. వైట్ టైగర్ సినిమా చిత్రీకరణ కోసం మాస్క్, కళ్లద్దాలు పెట్టుకొని మరీ సెట్​కు వెళ్తున్నానని ఇన్​ స్టాలో షేర్ చేసింది.

ప్రియాంక చోప్రా

By

Published : Nov 5, 2019, 6:21 AM IST

ప్రస్తుతం దిల్లీలో కాలుష్యం తీవ్రరూపం దాల్చింది. ఈ అంశంపై సామాజిక మాధ్యమాల వేదికగా చాలమంది తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ విషయంపై స్పందించింది. సినిమా షూటింగ్ కోసం మాస్క్​, కళ్లద్దాలు పెట్టుకొని సెట్​కు వెళ్తోందట. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్​స్టాలో షేర్ చేసింది.

"దిల్లీలో కాలుష్యం వల్ల చిత్రీకరణలో పాల్గొనటం చాలా కష్టంగా ఉంది, ‘వైట్‌ టైగర్‌’ చిత్రీకరణలో పాల్గొన్నాను. తాజా పరిస్థితుల వల్ల ఇక్కడ షూటింగ్‌ చేయటం చాలా కష్టంగా ఉంది. ఈ కాలుష్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారో తలచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది. కాలుష్యం నుంచి కాపాడుకోవటానికి మనకి మాస్క్‌లు ఉన్నాయి. కానీ ఇల్లు లేని చాలా మంది ప్రజలు రోడ్లు మీద నివసిస్తూ ఈ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు" -ప్రియాంక చోప్రా, ఇన్​ స్టా పోస్ట్​.

ప్రస్తుతం ది వైట్ టైగర్ అనే సినిమాలో నటిస్తోంది ప్రియాంక. ఇటీవల దిల్లీలో ప్రారంభమైందీ చిత్ర షూటింగ్​. ప్రముఖ రచయిత అరవింద్‌ అడిగా రచించిన ‘ది వైట్‌ టైగర్‌’ పుస్తకం ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రుపొందిస్తున్నారు.

ఇదీ చదవండి: దేవధర్ ట్రోఫీ విజేతగా 'భారత్ బీ'.. ఆకట్టుకున్న కేదార్

ABOUT THE AUTHOR

...view details