ప్రపంచమంతా కరోనా సంక్షోభంతో అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు అసోంను వరదలు కోలుకోనీయకుండా చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా వేల మంది నిరాశ్రయులయ్యారు. పలు గ్రామాలు నీట మునగడం వల్ల ప్రాణ, ఆస్తినష్టం భారీగా సంభవించింది. అయితే తాజాగా ఈ విపత్తు బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు స్టార్ కపుల్ ప్రియాంక చోప్రా-నిక్. భారీ మొత్తంలో విరాళాన్ని అందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది ప్రియాంక.
"అసోం పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. వరదల వల్ల లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ప్రాణ, ఆస్తినష్టం ఊహకు కూడా అందనిది. వరద పోటెత్తడం వల్ల కజిరంగ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా మునిగిపోయింది. ఇలాంటి సమయంలో వారికి మన మద్దతు అవసరం. అసోంలో పనిచేస్తోన్న కొన్ని సంస్థలకు మేము విరాళాలు అందించాం. వారు అవసరమైన వారికి సాయం చేస్తారు.
-ప్రియాంక, కథానాయకురాలు.