తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Priyanka chopra: 'స్టార్​డమ్​ పక్కనపెట్టి.. అవకాశాల కోసం అలా' - ప్రియాంక చోప్రా హాలీవుడ్

Priyanka chopra: భారత్​లో సంపాదించిన స్టార్​డమ్​ గురించి హాలీవుడ్​లో తెలియనివ్వలేదని చెప్పారు నటి ప్రియాంక చోప్రా. ఏడేళ్ల కింద అమెరికా వెళ్లిన తాను అక్కడ అవకాశాల కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు.

Priyanka chopra
ప్రియాంక చోప్రా

By

Published : Dec 23, 2021, 8:13 AM IST

Priyanka chopra: బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందినా.. ఆ స్టార్‌డమ్‌ను హాలీవుడ్‌లో చూపించలేదని అంటున్నారు నటి ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌ నుంచి అంతర్జాతీయ నటిగా ఆమె ఎదిగిన తీరు ఎంతో మంది నటీనటులకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. తాజాగా ఆమె నటించిన హాలీవుడ్‌ చిత్రం 'ది మ్యాట్రిక్స్‌ రీసర్రెక్షన్స్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రియాంక ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హాలీవుడ్‌లో అవకాశాల కోసం తను పడిన కష్టం గురించి చెప్పుకొచ్చారు.

'ది మ్యాట్రిక్స్‌ రీసర్రెక్షన్స్‌'లో ప్రియాంక

"ఏడేళ్ల కిందట యూఎస్‌కి వెళ్లి హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశాలు పొందడానికి చాలా కష్టపడ్డాను. భారత్‌లో నాకున్న స్టార్‌డమ్‌ గురించి ఎవరికీ చెప్పలేదు.. చూపించలేదు. ఒక కొత్త నటిలా ప్రతి స్టూడియోకి వెళ్లి అవకాశం ఇవ్వమని కోరాను. అనేక ఆడిషన్లలో పాల్గొన్నాను. నేను కూడా కీలక పాత్రలు, ప్రధాన పాత్రలు పోషిస్తానని నిరూపించడం కష్టతరంగా ఉండేది" అని ప్రియాంక వెల్లడించారు.

ప్రియాంక చోప్రా

అంతర్జాతీయ చిత్రసీమలో దక్షిణాసియా నటులకు అవకాశాలు తక్కువగా ఉండేవని.. ఇప్పుడు తను, మరికొందరు నటులు ఆ లోటును తీర్చడం ప్రారంభించామని ప్రియాంక తెలిపారు. అయితే, ఇంకా అనేక మంది నటులు అంతర్జాతీయంగా రాణించాలని కాంక్షించారు. 2015లో 'క్వాంటికో' చిత్రంతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీగా ఉంటున్నారు. అమెరికన్‌ సింగర్‌ నిక్‌జోనస్‌ని పెళ్లాడి.. అక్కడే స్థిరపడిపోయారు.

ఇదీ చూడండి:నిక్ సతీమణి ట్యాగ్.. ప్రియాంక చోప్రా ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details