గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా షేర్ చేసిన ఓ సెల్ఫీ అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. షూటింగ్ సెట్లో సరదాగా దిగిన ఈ ఫొటోలో కనిపిస్తున్న గాయాల్లో ఏది నిజమో గుర్తించాలని తన అభిమానులను ప్రశ్నించింది.
ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుపుకొంటున్న స్పై సిరీస్ 'సిటాడెల్' సెట్లో తీసిన ఈ ఫొటోలో ప్రియాంక ముఖం, నుదిటిపై రక్తపు గాయాలున్నాయి. దీనిపై 'ది స్కై ఈజ్ పింక్' హీరో స్పందించాడు. ప్రియాంక కనుబొమ్మపై ఉన్న మచ్చ నిజమేనని.. కానీ ఆమె చెంపపై ఉన్న రక్తపు మరకలు నకిలీవని తెలిపాడు.