'మ్యాట్రిక్స్ 4'లో ప్రియాంకచోప్రాను చేర్చేందుకు.. చిత్రబృందం ఈ బాలీవుడ్ బ్యూటీతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇందులో ప్రియాంకపాత్ర గురించి వివరాలు ఇంకా తెలియలేదని సమాచారం. ఈ ఫ్రాంఛైజీలో నాలగవ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. ఈ చిత్రానికి వార్నర్ బ్రదర్స్, విలేజ్ రోడ్‌షో నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. 2021 మే 21న తెరపైకి రానుంది. 1999లో విడుదలైన మ్యాట్రిక్స్, ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన సైన్స్-ఫిక్షన్ చిత్రాలలో ఒకటిగా నిలిచాయి.
'మ్యాట్రిక్స్' నూతన సిరీస్‌లో 'ప్రియాంకచోప్రా'..! - ETV Bharat
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకచోప్రా మరో హలీవుడ్ చిత్రంలో కనిపించనుంది. సైన్స్-ఫిక్షన్ కథాంశంతో సాగే మ్యాట్రిక్స్ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే ఆమెను సంప్రదించినట్టు సమాచారం.
!['మ్యాట్రిక్స్' నూతన సిరీస్‌లో 'ప్రియాంకచోప్రా'..! Priyanka Chopra Jonas in talks for 'Matrix 4'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5887666-469-5887666-1580320825256.jpg)
మ్యాట్రిక్స్ ఫ్రాంఛైజీలో అడుగుపెడుతున్న ప్రియాంకచోప్రా
ఈ చిత్రానికి లానా వాచోవ్స్కీ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఆయన సోదరి లిల్లీతో కలిసి ఈ ఫ్రాంచైజీలో మూడు చిత్రాలను డైరెక్ట్ చేశాడు. ఈ సిరీస్ తారాగణంలో కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్, యాహ్యా అబ్దుల్-మతీన్, నీల్ పాట్రిక్ హారిస్‌లు ఉన్నారు.
ఇదీ చూడండి... ఆర్ఆర్ఆర్ సర్ప్రైజ్: ఒకే ఫ్రేములో నలుగురు స్టార్లు
Last Updated : Feb 28, 2020, 11:36 AM IST