తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వర్సిటీ విద్యార్థులతో కలిసి ప్రియాంక కిరాక్ డాన్స్ - హీరోయిన్ ప్రియాంక చోప్రా

హీరోయిన్ ప్రియాంక చోప్రా.. స్కై ఈజ్ పింక్ సినిమా ప్రచారంలో భాగంగా విద్యార్ధులతో కలిసి పాడుతూ, నృత్యం చేసింది. నోయిడాలోని ఆమిటి యూనివర్సిటీ ఇందుకు వేదికైంది.

విద్యార్ధులతో కలిసి ప్రియాంక ఆట పాట

By

Published : Oct 2, 2019, 10:49 AM IST

Updated : Oct 2, 2019, 8:46 PM IST

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. తన కొత్త బాలీవుడ్​ సినిమా 'స్కై ఈజ్​ పింక్' ప్రచారంలో బిజీగా ఉంది. అందులో భాగంగా నోయిడా సెక్టార్ 125లోని ఆమిటి యూనివర్సిటీలో సందడి చేసింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర దర్శకురాలు సోనాలి బోస్, సహనటుడు రోహిత్ శరఫ్​తో కలిసి హాజరైంది. పాట పాడుతూ, నృత్యం చేస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచింది. చాలా కాలం తర్వాత దిల్లీ వచ్చానని, ఇక్కడి వారిని కలుసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పింది.

ఆమిటి యూనివర్సిటీలో ప్రచారం చేస్తున్న ప్రియాంక చోప్రా

బాలీవుడ్​లో దాదాపు మూడేళ్ల తర్వాత ప్రియాంక కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్, జైరా వాసీం ఇతర పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

విద్యార్ధులతో కలిసి ప్రియాంక చోప్రా సెల్ఫీ

ఇది చదవండి:సినిమా చూసి నిక్ ఏడ్చేశాడు: హీరోయిన్ ప్రియాంక చోప్రా

Last Updated : Oct 2, 2019, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details