తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమంత రూట్​లో ప్రియాంక!.. ఎందుకలా చేసింది? - ప్రియాంకా చోప్రా నిక్​ జోనస్​ డైవర్స్​

గ్లోబల్​ స్టార్​ హీరోయిన్​ ప్రియాంకా చోప్రా(priyanka chopra removed jonas name) తన సోషల్​మీడియా ఖాతా ప్రొఫైల్​ పేర్ల​ నుంచి తన భర్త జోనస్​ పదాన్ని తొలిగించింది. దీంతో వారిద్దరు విడిపోతున్నారా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

priyanka jonas divorce
ప్రియాంక జోనస్​

By

Published : Nov 22, 2021, 10:20 PM IST

Updated : Nov 22, 2021, 10:28 PM IST

బాలీవుడ్​, హాలీవుడ్​ మోస్ట్​ బ్యూటిఫుల్ కపుల్​ ప్రియాంకా చోప్రా-నిక్​ జోనాస్(priyanka chopra removed jonas name)​ విడిపోతున్నారా? ప్రస్తుతం నెటిజన్ల మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఇది. ప్రియాంకా చోప్రా తన ఇన్​స్టా ప్రొఫైల్​ నేమ్​ నుంచి భర్త నిక్​ జోనస్​ పేరు తొలగించడమే ఇందుకు కారణం. ట్విట్టర్​లోనూ చోప్రా, జోనస్​ పేర్లను తొలగించి ప్రియాంక మాత్రమే ఉంచింది. దీంతో ఆమె అభిమానులు, ఫాలోవర్స్​ షాక్​కు గురౌతున్నారు.

ఇటీవలే టాలీవుడ్​ కపుల్​ నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు(chaysam divorce). అయితే ఈ ప్రకటన ముందు సామ్​ కూడా తన సోషల్​మీడియా ఖాతాల నుంచి అక్కినేని పేరును తొలగించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక కూడా తన సామాజిక మాధ్యమాల ఖాతాల పేర్లను మార్చడం వల్ల ప్రియాంక-నిక్​ మధ్య కూడా బంధం చెడిందా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వారిద్దరూ స్పందించేవరకు వేచి ఉండాల్సిందే.

స్పందించిన ప్రియాంక తల్లి

అయితే ఈ విషయంపై ప్రియాంక తల్లి మధు స్పందించారు. ప్రియాంక-జోనస్​ విడిపోనున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అవన్నీ అవాస్తమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: నెట్టింట ప్రియాంక హాట్​ ఫొటో.. షాకైన సోదరి పరిణీతి

Last Updated : Nov 22, 2021, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details