తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ విషయంలో సోనూకు ప్రియాంక మద్దతు - ప్రియాంక చోప్రా

కొవిడ్​ కారణంగా తల్లిదండ్రులను పొగొట్టుకున్న చిన్నారులకు ఉచిత విద్యను అందిచాలని నటుడు సోనూసూద్​ ఇటీవలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ విషయంలో సోనూకు తాను మద్దతు ఇస్తున్నట్లు కథానాయిక ప్రియాంకా చోప్రా వెల్లడించారు. సోనూను చూసి ఇలాంటి విషయాల్లో స్ఫూర్తి పొందుతున్నానని ఆమె చెప్పారు.

Priyanka Chopra calls Sonu Sood 'visionary philanthropist'
ఆ విషయంలో సోనూసూద్‌కు మద్దతుగా ప్రియాంక

By

Published : May 4, 2021, 2:02 PM IST

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలని నటుడు సోనూసూద్‌ ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సోనూకు మద్దతుగా ప్రముఖ నటి ప్రియాంక చోప్రా నిలిచారు. ఈ మేరకు సోనూ గొప్పతనాన్ని చాటుతూ ట్వీట్‌ చేశారామె.

"విజనరీ ఫిలాంత్రపిస్ట్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? నా సహనటుడు సోనూ సూద్‌ అలాంటి వ్యక్తే. అతని ఆలోచనలు, ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి. కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన వారికి ప్రభుత్వాలు ఉచిత విద్య అందించాలన్న ఆయన ఆలోచన గొప్పది. సోనూను చూసి నేను స్ఫూర్తి పొందుతున్నాను. కొవిడ్‌తో తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారుల చదువులు అక్కడితో ఆగిపోకూడదు. ఆర్థిక సమస్యల కారణంగా వారు చదువుకు దూరం అవకూడదు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చాలామంది విద్యార్థులు నష్టపోతారు. విద్య.. ప్రతి ఒక్కరి జన్మహక్కు. విద్యను ప్రోత్సహించేందుకు నేనూ నా వంతు కృషి చేస్తాను."

- ప్రియాంకా చోప్రా, కథానాయిక

ప్రియాంక వ్యాఖ్యలపై స్పందించిన సోనూ.. "ఈ మిషన్‌కు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రియాంక. మనందరం కలిస్తే అనుకున్నది సాధ్యమవుతుంది" అని అన్నారు.

ఇదీ చూడండి:'బుట్టబొమ్మ'.. ఆ రికార్డు సాధించిన తొలి తెలుగు పాట

ABOUT THE AUTHOR

...view details