తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా నిజమైన బాలీవుడ్​ హీరో ఇతడే: ప్రియాంక

తన భర్తను బాలీవుడ్​ హీరోతో పోల్చింది నటి ప్రియాంక చోప్రా. తమ వివాహ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Priyanka Chopra calls Nick Jonas her 'real life Bollywood hero' on second wedding anniversary
నా నిజమైన బాలీవుడ్​ హీరో ఇతడే: ప్రియాంక

By

Published : Dec 3, 2020, 7:20 PM IST

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, పాప్​ సింగర్​ నిక్​ జోనాస్​.. గురువారం తమ వివాహ రెండో వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఇన్​స్టాలో ఆసక్తికర పోస్ట్​ పెట్టారు నిక్. 2018 డిసెంబరు 2న క్రిస్టియన్​ సంప్రదాయ ప్రకారం పెళ్లి జరగ్గా.. ఆ తర్వాత రోజు (డిసెంబరు 3న) జోద్​పుర్​లో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు.

"రెండు రోజులు చేసుకున్న పెళ్లి.. నేటితో(డిసెంబరు 3) రెండేళ్లు పూర్తి చేసుకుంది. ప్రియాంకను తన దేశంలో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం నాకు దక్కిన గౌరవం. సమయం ఎంతో త్వరగా గడిచిపోయింది. నేను ఎంతో అదృష్టవంతుడ్నో నమ్మలేకపోతున్నా. హిందూ పెళ్లిరోజు శుభాకాంక్షలు బ్యూటిఫుల్​" అని నిక్​ పోస్టు చేశారు.

దీనిపై స్పందించిన ప్రియాంక.. "నా నిజజీవిత బాలీవుడ్​ హీరో. ఐ లవ్​ యూ హ్యాండ్సమ్​" అని నిక్​కు రిప్లై ఇచ్చింది. తమ పెళ్లి ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

ABOUT THE AUTHOR

...view details