ప్రియాంక చోప్రా దృష్టంతా ఇప్పుడు హాలీవుడ్ పైనే ఉంది. ఆమెలో మంచి నటే కాదు గాయనీ ఉంది. గతంలో పలు ప్రత్యేక వీడియో గీతాల్ని విడుదల చేసింది. 'ఇన్ మై సిటీ' వీడియో గీతంతో గాయనిగా మారిన ప్రియాంక.. ఆ తర్వాత 'ఎక్జోటిక్', 'ఐ కాంట్ మేక్ యు లవ్ మి' గీతాలతో అలరించింది. ఇప్పుడు ఎలాగూ తన భర్త నిక్ సంగీత ప్రపంచంలో అనుభవం ఉన్నవాడే కాబట్టి మళ్లీ గాయనిగా మారడానికి ప్రియాంక ఆసక్తి చూపిస్తుందా? అంటే లేదు అనే సమాధానమే ఆమె నుంచి వినిపిస్తోంది.
'నేను పాడటమా.. అంత తీరిక లేదు' - ప్రియాంక చోప్రా లేటేస్ట్ న్యూస్
తాను పాడటం గురించి ప్రియాంక చోప్రా మాట్లాడింది. ప్రస్తుతం అంత తీరిక లేదని, ఆ అధ్యాయాన్ని ఎప్పుడో ముగించానని తెలిపింది. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటోంది.
'నేను పాడటమా.. అంత తీరిక లేదు'
"నిక్ సంగీతంలో నిష్ణాతుడు. ఇప్పుడు ఆయనతో నా ఇమేజ్ పెంచుకోవాలి అనుకోవడం లేదు. సంగీతం అనే అధ్యాయాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే ముగించాను. ఇప్పుడు మళ్లీ దాని జోలికి వెళ్లే తీరిక లేదు. అంతకంటే ప్రాధాన్యం ఉన్న విషయాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. ప్రస్తుతం నా దృష్టంతా నటన, చిత్ర నిర్మాణం మీదే"అని చెప్పింది ప్రియాంక. ప్రస్తుతం లండన్లో 'సిటాడెల్' వెబ్ సిరీస్ చిత్రీకరణలో ఉంది. నెట్ఫ్లిక్స్ కోసం ఆమె చేస్తున్న సిరీస్ ఇది.
ఇది చదవండి:ప్రియాంక చోప్రా స్టోరీలు