'ఆర్ఎక్స్ 100' వంటి హిట్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం 'మహాసముద్రం'. శర్వానంద్ హీరోగా, సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గాఢతతో నిండిన చక్కటి ప్రేమకథతో రూపొందనున్న చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. ఈ చిత్రంలో శర్వాకు జోడీగా కనిపించబోయే నాయిక కోసం సమంత, సాయిపల్లవి, అదితీరావు హైదరీ వంటి వారి పేర్లు వినిపించాయి.
శర్వాతో సందడి చేయనున్న 'గ్యాంగ్‌లీడర్' భామ! - శర్వానంద్ మహాసముద్రం
టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'మహాసముద్రం'. ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం సిద్ధార్థ్‌ను ఎంపిక చేసింది చిత్రబృందం. ఇందులో హీరోయిన్గా 'గ్యాంగ్‌లీడర్' భామ ప్రియాంక అరుల్ మోహన్‌ను సంప్రదించినట్లు సమాచారం.
శర్వాతో సందడి చేయనున్న 'గ్యాంగ్‌లీడర్' భామ!
ఇప్పుడీ అవకాశం 'గ్యాంగ్‌లీడర్' భామ ప్రియాంక అరుల్ మోహన్ అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా చేస్తున్న 'శ్రీకారం' చిత్రంలోనూ ఆమె కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడీ జోడీనే మరోసారి ఈ కొత్త చిత్రంలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఈ కథకు అంగీకారం తెలిపిందని, మరికొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.