తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాలీవుడ్​లో దూకుడు పెంచిన ప్రియాంక - బాలీవుడ్ భామ

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్​లో జోష్​ కొనసాగిస్తోంది. ఇటీవల 'ఇజింట్​ ఇట్​ రొమాంటిక్​' చిత్రంతో మంచి విజయం అందుకున్న ఈ సుందరి మరో ప్రాజెక్టు కోసం సంతకం చేసింది.

హాలీవుడ్​లో ప్రియాంక మరింత దూకుడు

By

Published : Apr 14, 2019, 6:31 AM IST

అమెరికన్​ గాయకుడు నిక్​ను పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్​లో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమవుతోంది ప్రియాంక చోప్రా. క్వాంటికో అనే సీరియల్​తో పాటు బేవాచ్ చిత్రంతో అక్కడి ప్రేక్షకులను మైమరపించింది. ఆ త‌ర్వాత ‘ట్రాన్స్‌పరెంట్‌’ సిరీస్‌ దర్శకుడు సిలాస్‌ హోవర్డ్‌ దర్శకత్వంలో ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్’ అనే చిత్రం చేసిందీ అమ్మడు.

  1. ఇటీవల ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ అనే హాలీవుడ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ప్రియాంక చోప్రా. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజ‌యం సాధించింది . ప్రస్తుతం ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ ఏడాది అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుందీ చిత్రం.
  2. తాజాగా మ‌రో హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సైన్ చేసిన‌ట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది ప్రియాంక. వివిధ సంస్కృతి, సంప్ర‌దాయాల వల్ల వివాహల్లో వ‌చ్చే గొడ‌వ‌ల ఆధారంగా కామెడీ నేపథ్యంలో ఈ కొత్త చిత్రం రూపొందుతుందని వెల్లడించింది. సినిమా హక్కులను యూనివ‌ర్స‌ల్ స్టూడియో ద‌క్కించుకుంది. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

​​​​​​​.

ABOUT THE AUTHOR

...view details