సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'భారత్'. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియంక చోప్రా చేయాల్సి ఉంది. కానీ నిక్ జోనస్‌తో పెళ్లి వల్ల ఈ మూవీ నుంచి తప్పుకుంది ప్రియాంక. ఈ విషయంపై దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ స్పందిస్తూ.. ప్రియాంక, నేనూ ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నామని తెలిపాడు.
"ప్రియాంక సినిమా నుంచి తప్పుకోవడానికి బలమైన కారణం ఉంది. తన జీవితంలో ప్రత్యేకమైన సమయం అది. డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్లే తప్పుకుంది. ఈ విషయం వల్ల మా స్నేహం ఎంతమాత్రం బలహీనపడలేదు. మళ్లీ కలిసి మరో సినిమా చేస్తాం".
అలీ అబ్బాస్ జాఫర్, బాలీవుడ్ దర్శకుడు