తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవర్​ఫుల్​ విలన్​గా చేయాలనుంది: ప్రియమణి - priyamani family man 3

Priyamani new movie: 'భామా కలాపం' అనే థ్రిల్లర్​తో ప్రేక్షకుల్ని పలకరించిన ప్రియమణి.. తన కొత్త ప్రాజెక్టుల గురించి చెప్పింది. 'ఫ్యామిలీ మ్యాన్ 3' చేయాల్సి ఉందని తెలిపింది.

priyamani
ప్రియమణి

By

Published : Feb 13, 2022, 6:56 AM IST

Updated : Feb 13, 2022, 8:06 AM IST

Priyamani news: "నటిగా నేనిప్పటి వరకు చేసిన సినీప్రయాణం కొంతే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. పాత్రల విషయంలో నా ఆకలి ఇంకా తీరలేదు. మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాలనుంది" అని నటి ప్రియమణి చెప్పింది.

ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'భామా కలాపం'. అభిమన్య తాడిమేటి దర్శకత్వం వహించారు. ఓటీటీ వేదిక ఆహాలో ఇటీవల విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది ప్రియమణి.

భామా కలాపం సినిమాలో ప్రియమణి

"నేనిందులో అనుపమ అనే గృహిణి పాత్రలో నటించా. సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అభిమన్య కథ చెప్పినప్పుడే నాకీ స్క్రిప్ట్‌ చాలా నచ్చేసింది. ఎందుకంటే మధ్యతరగతి గృహిణిగా.. ఇలాంటి అమాయకమైన పాత్ర నేనింత వరకు చేయలేదు. అదే నాలో ఆసక్తిరేకెత్తించింది. ఇది నా నిజ జీవితానికి పూర్తి భిన్నమైన పాత్ర. నేను కొత్తదనం నిండిన పాత్రలు చేయాలనుకుంటున్నా. శక్తిమంతమైన విలన్‌ పాత్రలు పోషించాలనుంది"

"ప్రస్తుతం తెలుగులో రానాతో కలిసి 'విరాటపర్వం' చేస్తున్నాను. హిందీలో అజయ్‌ దేవగణ్‌తో 'మైదాన్‌'లో చేస్తున్నా. కన్నడలో 'డాక్టర్‌ 56' చేశా. తమిళంలో 'కొటేషన్‌ గ్యాంగ్‌' సినిమా చేస్తున్నా. అలాగే 'ఫ్యామిలీ మ్యాన్‌ 3' వెబ్‌సిరీస్‌ చేయాల్సి ఉంది".

ఇవీ చదవండి:

Last Updated : Feb 13, 2022, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details