'నారప్ప' సినిమాలో డీ గ్లామరైజ్‌గా కనిపించిన మెప్పించిన నటి ప్రియమణి.. ప్రస్తుతం విభిన్న పాత్రలు చేస్తూ అలరిస్తోంది. ఓ వైపు వెబ్ సిరీస్, మరోవైపు పలు భాషల్లోని చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఇప్పుడు ఆమెకు అద్భుతమైన అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమాలోని కీలకపాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Priyamani: ప్రియమణికి బంపర్ ఆఫర్.. పవన్ సినిమాలో ఛాన్స్! - ప్రియమణి షారుక్
పవన్-హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కే కొత్త సినిమా కోసం నటి ప్రియమణిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే ఆమె పాత్ర ఏంటి? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రియమణి
పవన్, డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రకటన వచ్చినప్పటికీ.. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల తర్వాత అందులో పవర్‌స్టార్ నటిస్తారు. అయితే 'నారప్ప'లో ప్రియమణి నటన చూసి ఫిదా అయితే ఈ చిత్రబృందం.. తమ సినిమా కోసం ఎంపిక చేసుకుందట.
ఇవీ చదవండి:
Last Updated : Sep 4, 2021, 6:53 AM IST