నటి ప్రియమణి(Priyamani) తెలుగులో మళ్లీ జోరు చూపిస్తోంది. బలమైన నాయికా ప్రాధాన్య పాత్రలు ఎంచుకుంటూ.. వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఈక్రమంలోనే ఇప్పుడామె 'యాక్ట్ 1978' రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం. యజ్ఞ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కన్నడ చిత్రమిది. దర్శకుడు మన్సోరే తెరకెక్కించారు. ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన డబ్బులు రాకపోతే.. ఓ గర్భిణి ఏం చేసిందన్నది ఈ చిత్ర కథాంశం.
గతేడాది కన్నడలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్ర రీమేక్ హక్కులను నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకున్నారని తెలిసింది. తెలుగులో ప్రియమణితో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి ప్రస్తుతం వెంకటేష్.. 'నారప్ప', రానా.. 'విరాటపర్వం' చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
కార్తిక్ ప్రేమలో శ్రద్ధ!