'ద ఫ్యామిలీ మ్యాన్ 2'.. జూన్ 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ అంచనాల్ని పెంచుతోంది. అయితే ఇందులో సూసైడ్ బాంబర్‌గా నటించిన సమంతతో పాటు ప్రియమణి పాత్రకు సంబంధించిన ఓ విషయం అభిమానులను ఆసక్తి కలిగిస్తోంది.
భర్తతో ఎప్పుడూ గొడవ పడే మధ్య తరగతి భార్యగా ప్రియమణి తొలి సీజన్లో నటించింది. అయితే తొలి భాగం అన్ని ఎపిసోడ్లు చూసిన పలువురు అభిమానులకు, ప్రియమణి పాత్రకు ఎఫైర్ ఉందేమో అనే చిన్న అనుమానం కలిగింది. దీని గురించి చాలామంది ఆమెనే నేరుగా అడిగేశారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రియమణినే వెల్లడించింది. రెండో సీజన్లో దానికి సమాధానం దొరుకుతుందని, కాకపోతే అది కాస్త ఆసక్తిగా ఉంటుందని చెప్పింది.