సామాజిక మాధ్యమాల్లో ఒకే ఒక్క సన్నివేశంతో సంచలనం సృష్టించిన కేరళ నటి ప్రియా వారియర్. ప్రస్తుతం ప్రియా హిందీలో ‘'లవ్ హ్యాకర్స్' అనే సినిమా చేసేందుకు అంగీకరించిందట. ఈ చిత్రానికి మయాంక్ ప్రకాశ్ శ్రీవాత్సవ దర్శకత్వం వహించనున్నాడు.
సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ ఆసరాగా కొన్ని నిజజీవిత కథల ఆధారంగా సినిమా తెరకెక్కనుందని సమాచారం. అనుకోకుండా ఓ అమ్మాయి ‘లవ్ హ్యాకర్స్’కు చిక్కడం, ఆ తరువాత ఆ అమ్మాయి ఎదుర్కొన్న సమస్యలు, వాటి నుంచి ఎలా తప్పించుకుంది అనేది కథ.