యువ కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఇటీవలే కారు ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుడైన నకుల్ థంపి చేతిని నిమురుతూ ఓదారుస్తోంది. డాన్సర్‌గా గుర్తింపు పొంది ఇటీవలే నటుడిగా మారాడు నకుల్.
స్నేహితుడి గురించి ప్రియా వారియర్ భావోద్వేగ పోస్టు
ఒకే ఒక కన్నుగీటుతో కుర్రకారును తనవైపుకు తిప్పుకుంది యువ కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్. అప్పటి నుంచి ఆమెకు విశేష ప్రేక్షకాదరణ దక్కుతోంది. తాజాగా ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన స్నేహితుడైన నకుల్‌తో కనిపించిందీ నటి.
ప్రియా ప్రకాష్ వారియర్‌తో ఉన్న అతనెవరో తెలుసా?
"నకుల్ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అతడి గురించి ఆలోచిస్తున్న శ్రేయోభిలాషులందరికీ నకుల్ తన ప్రేమను, కృతజ్ఞతను తెలియజేశాడు" అని పోస్టు చేసింది ప్రియా వారియర్.
నకుల్ పుట్టినరోజు సందర్భంగా ప్రియ ఇటీవలే ఓ భావోద్వేగ పోస్టును షేర్ చేసింది. వారిద్దరిదీ బలమైన స్నేహమని అందులో పేర్కొంది.