ఒక్క సినిమాతోనే క్రేజీ కథానాయికగా మారిపోయిన కేరళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ మరిన్ని హిందీ చిత్రాల్లో నటించాలని ఉందని చెబుతోంది.
ప్రస్తుతం ప్రియ బాలీవుడ్‌లో చేస్తున్న రెండో సినిమా 'లవ్ హ్యాకర్స్'. మయాంక్ ప్రకాష్ శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా సాంకేతికంగా అభివృద్ది చెందుతున్న ఈ సమయంలో సైబర్ వరల్డ్ డార్క్ సైడ్ నేపథ్యంగా తెరకెక్కుతోన్న చిత్రంలో ప్రియ ప్రధాన పాత్రలో కనిపించనుంది.