తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటనే కాదు పాడటం వచ్చంటున్న ప్రియా ప్రకాశ్ - NITHIN

మలయాళ ముద్దుగుమ్మ ప్రియాప్రకాశ్ గాయని అవతారమెత్తింది. ఓ మలయాళ సినిమా కోసం పాట పాడి ఆ వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది.

నటనే కాదు పాడటం వచ్చంటున్న ప్రియా ప్రకాశ్

By

Published : Jun 26, 2019, 5:26 PM IST

కన్నుగీటే సన్నివేశంతో రాత్రికి రాత్రే సెన్సేషన్​గా మారింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ప్రస్తుతం హీరోయిన్​గా పలు సినిమాల్లో చేస్తోంది. ఇప్పుడు తనలోని మరో కోణాన్ని బయటకు తీసింది. తన గళంతో సంగీత ప్రియుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఓ మలయాళ చిత్రం కోసం తొలిసారి పాట పాడింది. ఆ వీడియోనూ తన ఇన్​స్టాలో పంచుకుంది. తొలి ప్రయత్నాన్ని మెచ్చుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపింది.

క్రీడా నేపథ్యంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు కైలాష్‌ మేనన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో గీతాన్ని గాయకుడు నరేశ్‌ అయ్యర్‌తో కలిసి ఎంతో చక్కగా ఆలపించిందీ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం టాలీవుడ్​లో నితిన్‌, నాని సరసన కథానాయికగా నటిస్తోంది. తొలి బాలీవుడ్‌ మూవీ ‘శ్రీదేవి బంగ్లా’ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇది చదవండి: నితిన్​తో కలిసి ప్రియా ప్రకాశ్ ఏ మాయ చేస్తుందో!

ABOUT THE AUTHOR

...view details