మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్.. మరో బోల్డ్ పాత్రలో నటించేందుకు సిద్ధమైంది. 'విష్ణు ప్రియ' పేరుతో తెరకెక్కనున్న చిత్రంతో కన్నడ చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే 'ఒరు అదార్ లవ్' సినిమాలో ముద్దు సీన్‌తో అలరించిన ఈ అమ్మడు... మరింత రొమాంటిక్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
'పెద్దహులి' ఫేమ్ శ్రేయాస్ హీరోగా, మంజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈనెల 9 నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే షూటింగ్‌కు ముందు బెంగళూరు వచ్చిన ప్రియా.. ఈటీవీ భారత్‌తో ముచ్చటించింది.
ఈటీవీ భారత్‌తో ప్రియా ప్రకాశ్ ముఖాముఖీ
" తొలిసారి కన్నడలో నటించే అవకాశం వచ్చింది. సినిమాలో బోల్డ్ పాత్రలో కనిపించనున్నాను. దర్శకుడు మంజు.. నా తొలి చిత్రం విడుదలకు ముందే నన్ను సంప్రదించారు. భాషపై పట్టు పెంచుకునేందుకు కన్నడ సినిమాలు చూడటం మొదలుపెట్టాను. హీరో శ్రేయాస్ మాత్రమే ప్రస్తుతానికి నాకు స్నేహితుడు. ఈ ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు. సినిమా టైటిల్ 'విష్ణు ప్రియ'. ప్రియ అనే పేరు నా ప్రతీ సినిమాలో పెడుతుండటం ఆనందంగా ఉంది. ఇందులో కన్నుగీటే సన్నివేశాలు ఉండవు కాని అందరూ గుర్తించేలా నా పాత్ర ఉంటుంది". -ప్రియా వారియర్, సినీ నటి
తెలుగులో నితిన్ సరసన 'రంగ్‌దే' సినిమాలో నటిస్తోంది ప్రియా. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది రానుంది.
ఇది చదవండి: అతిలోక సుందరే కదా..! నిజమా? భ్రాంతా?