2017లో 'ఒరు అదార్ లవ్' అనే మలయాళ చిత్రంతో రాత్రికి రాత్రే పెద్ద స్టార్‌గా మారిన కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమా 'లవర్స్ డే'గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ప్రియకు యువతలో పెద్దఎత్తున అభిమానులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 7.2 మిలయన్ ఫాలోవర్లు ఉన్నారు. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకుంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రియా ప్రకాష్ అభిమానులు చాలా కలవరపడుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకున్న ప్రియా వారియర్ - priya prakash warrier insta acoount close
'ఒరు అదార్ లవ్'తో యూత్ సెన్సేషన్‌గా మారిన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్. అభిమానులకు దగ్గరగా ఉండేందుకు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేది. కానీ తాజాగా ప్రియ ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకుంది.

ప్రియ ట్రోల్‌ల వల్లనే ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే నిజంగా ఇందుకోసమే తప్పుకుందా లేదా మరేదైనా కారణం ఉందా చెప్పలేదు. ప్రస్తుతం తనే తాత్కాలికంగా తప్పుకున్నట్లు చెప్పిందట. ఎప్పుడైనా తిరిగి రావొచ్చని కూడా చెప్పినట్లు సమాచారం.
ప్రియా ప్రకాష్ వారియర్ కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటే కాదు మిగతా సామాజిక మాధ్యమాల్లోను చాలా చురుగ్గా ఉంటుంది. బాలీవుడ్‌లో 'శ్రీదేవి బంగ్లా' అనే చిత్రంలో నటించింది. అప్పట్లో ఈ సినిమా టైటిల్‌పై వివాదం కూడా చెలరేగింది. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్బాజ్ ఖాన్ కూడా నటించాడు.