తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రౌడీ... నువ్వంటే నాకిష్టం: ప్రియా వారియర్​ - ప్రియా వారియర్​

యూత్​ఫుల్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి తీసుకున్న ఫొటోను సామాజిక మాద్యమాల్లో పంచుకుంది మలయాళీ కుట్టి ప్రియా ప్రకాశ్​ వారియర్​. 'నువ్వంటే నాకు చాలా ఇష్టం' అనే కామెంట్ పెట్టింది.

ప్రియా వారియర్​

By

Published : Aug 8, 2019, 7:31 PM IST

కన్నుగీటుతోనే ఎందరో మనసుల్ని గెలిచేసింది ప్రియా ప్రకాశ్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అమ్మడు..ఆ తర్వాత టాలీవుడ్​, బాలీవుడ్​లో ఆఫర్లు కొట్టేసింది.

కొన్ని రోజులుగా హైదరాబాద్​లోనే ఉంటున్న ఈ కేరళ కుట్టీ... రౌడీ హీరో విజయ్​ దేవరకొండను కలిసింది. అతడితో తీసుకున్న ఓ ఫొటోను నెట్టింట షేర్​ చేసింది. అంతేకాకుండా 'నువ్వంటే నాకు చాలా ఇష్టం'అని కామెంట్ కూడా పెట్టింది. ఇంకేముంది ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. వీరిద్దరి కాంబినేషన్​లో సినిమా రాబోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రియా వారియర్​, విజయ్ దేవరకొండ ఫొటో

తెలుగులో లవర్​బాయ్​​ నితిన్​ సరసన 'రంగే దే' సినిమాలో నటిస్తోంది ప్రియా. ఇందులో రకుల్ ప్రీత్​ సింగ్ మరో కథానాయిక. చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

మలయాళ సినిమా 'ఒరు ఆదార్ లవ్'​తో వెండితెరకు పరిచయమైంది ప్రియా. ప్రస్తుతం బాలీవుడ్​లో 'శ్రీదేవి బంగ్లా'లో నటిస్తుంది.

ఇదీ చూడండి: సుమతో పోర్చుగీస్ భాష​లో నాగ్​-రకుల్​ సందడి!

ABOUT THE AUTHOR

...view details