Rohit Sharma: చారిత్రక 1000వ వన్డేలో టీమ్ఇండియాకు నాయకత్వం వహించడం తన అదృష్టమని అన్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆదివారం మెతేరా మైదానంలో వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఈ ఘనత దక్కించుకోనుంది భారత్. ఇప్పటివరకు 999 వన్డేలు ఆడిన భారత్.. 518 విజయాలు, 431 ఓటములు నమోదుచేసింది.
1974లో తొలి వన్డే ఆడిన భారత్.. 47 ఏళ్ల తర్వాత ఇప్పుడు 1000వ వన్డే ఆడనుంది. 2002లో తన 500వ మ్యాచ్ ఆడింది.
"ఇదో (1000వ వన్డే ఆడటం) చారిత్రక ఘట్టం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో భాగస్వాములైనవారికి శుభాకాంక్షలు. ఇలాంటి మ్యాచ్‌లో టీమ్ఇండియాకు సారథ్యం వహించడం నాకు గౌరవం. జట్టుకు నడిపించడం నా అదృష్టం. మన ప్రయాణం ఎంతో గొప్పగా సాగింది. ఎందరో క్రికెటర్లు జట్టును ఉన్నంతగా తీర్చిదిద్దారు. మేమూ మరింత ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి కృషి చేస్తాం."
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్
భారత 100వ వన్డేకు కపిల్ దేవ్ కెప్టెన్‌గా ఉన్నాడు. కాగా, 500వ మ్యాచ్‌కు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించాడు.
బలపడుతూ.. ప్రయాణం..