తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మనీ హైస్ట్' క్రేజ్- రిలీజ్ రోజు ఉద్యోగులకు సెలవు - మనీ హైస్ట్​ సీజన్5

వెబ్​సిరీస్​ విడుదల దృష్ట్యా ఓ సంస్థ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించిందంటే నమ్మగలమా. కానీ, ఇది నిజం చేసి చూపించింది ఓ ప్రైవేటు సంస్థ. పాపులర్​ వెబ్​సిరీస్​ 'మనీ హైస్ట్​' ఐదో సీజన్(Money Heist Season 5) విడుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

money heist
మనీ హైస్ట్

By

Published : Aug 29, 2021, 6:57 PM IST

పాపులర్ వెబ్​సిరీస్ 'మనీ హైస్ట్' ఐదో సీజన్(Money Heist Season 5) సెప్టెంబర్ 3న నెట్​ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కాబోతోంది. ఈ సిరీస్​కు భారత్​లోనూ మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో 'వెర్వ్​లాజిక్' అనే ప్రైవేటు సంస్థ తమ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఐదో సీజన్​ విడుదల రోజును 'నెట్​ఫ్లిక్స్​ అండ్ చిల్'(Vervelogic Netflix Holiday) హాలీడేగా ప్రకటించి ఉద్యోగులను ఆశ్చర్యంలోకి నెట్టేసింది. ఈ మేరకు వర్క్​ఫ్రమ్​ హోమ్ టాస్క్​ లిస్ట్​ను కూడా విడుదల చేసింది.

అందుకే హాలీడే..

'మనీహైస్ట్​' రిలీజ్​ సందర్భంగా హాలీడే ప్రకటిస్తున్నట్లు వెర్వ్​లాజిక్​ సంస్థ సీఈఓ అభిషేక్ జైన్ తెలిపారు. 'మెజారిటీ ఉద్యోగులు ఆరోజు తప్పుడు కారణాలు చెప్పి సెలవు తీసుకుంటారు. కొందరు ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్​లో పెట్టేస్తారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు బంక్​ కొట్టే అవకాశముంది. అందుకే.. సెలవు ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నాం. కొన్ని సార్లు చిల్​గా ఉండే అవకాశమిస్తే ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు' అని జైన్ పేర్కొన్నారు.

హాయిగా బెడ్​పై కూర్చుని పాప్​కార్న్​ తింటూ వెబ్​ సిరీస్​ చూడమని జైన్.. తమ సంస్థ ఉద్యోగులకు తెలిపారు. వర్క్​ఫ్రమ్​లోనూ కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు థాంక్యూ చెప్పారు.

దీనిపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details