భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం(national film awards 2021 winners list) సోమవారం అట్టహాసంగా జరిగింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(venkaiah naidu party) చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు.
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా మలయాళం నుంచి 'మరక్కర్' నిలవగా, 'భోంస్లే' చిత్రానికి మనోజ్ బాజ్‌పాయీ, 'అసురన్' చిత్రానికి ధనుశ్ ఉత్తమ నటులుగా అవార్డులను సొంతం చేసుకున్నారు. 'మణికర్ణిక' చిత్రానికి కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. మరోవైపు, తెలుగులో 'జెర్సీ', 'మహర్షి' చిత్రాలకు(maharshi movie) నాలుగు విభాగాల్లో అవార్డులు లభించాయి.
విజేతలు వీరే..
> ఉత్తమ చిత్రం: మరక్కర్ (మలయాళం)
> ఉత్తమ నటుడు: మనోజ్ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్ (అసురన్)
> ఉత్తమ నటి : కంగనా రనౌత్ (మణికర్ణిక)
> ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరైన్)
> ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ
> ఉత్తమ ఎడిటింగ్: నవీన్ నూలి (జెర్సీ)
> ఉత్తమ వినోదాత్మక చిత్రం: మహర్షి
> ఉత్తమ హిందీ చిత్రం: చిచ్చోరే