తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రేమ వెన్నెల'ను పిలుస్తున్న తేజ్ - premavennala

చిత్రలహరి సినిమాలోని ప్రేమ వెన్నెల పాట ఆకట్టుకునేలా ఉంది.

సాయి ధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్

By

Published : Apr 2, 2019, 12:51 PM IST

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం '‘చిత్రలహరి'’. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. ‘'నేను శైల‌జ’' ఫేం కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ ఈ నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలోని మూడో పాటను మంగళవారం విడుదల చేసింది చిత్రబృందం. ప్రేమవెన్నెల అంటూ సాగే ఈ పాటను దేవీశ్రీ తనదైన శైలిలో మెలోడీగా రూపొందించాడు. "రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయెనేమో నీ రెండు కళ్లలా" అంటూ శ్రీమణి రచన అలరించేనా ఉంది. సుదర్శన్ అశోక్ వాయిస్ వినసొంపుగా ఉంది.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ పాటకు కూడా అలాంటి స్పందనే వస్తోంది.

ఇవీ చూడండి..తమిళ దర్శకుడు మహేంద్రన్ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details