తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'షో కేసులో అందమైన బొమ్మలా ఉండలేను'

వరుసగా హారర్​ చిత్రాలతో మెప్పిస్తూ ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న నటి నందితా శ్వేత. ఆమె కథానాయికగా నటించిన  ' ప్రేమకథా చిత్రమ్​ 2' నేడు విడుదలయింది. అయితే ఈ సందర్భంగా కొన్ని విశేషాలు పంచుకొంది.

'షో కేసులో అందమైన బొమ్మలా ఉండలేను'

By

Published : Apr 6, 2019, 9:21 PM IST

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలో దెయ్యం పాత్రలో నటించిన నందితా... ప్రేమకథా చిత్రం​ సీక్వెల్​లోనూ అదే పాత్రలో సందడి చేసింది. వరుసగా హారర్​ సినిమాలు చేయడానికి కారణం ఇలాంటి సినిమాలు తనకి ఇష్టమని మనసులోని మాట వెల్లడించింది శ్వేత.

నందితా శ్వేత
  • ప్రేమకథా చిత్రమ్​ మొదటి భాగం కంటే ఇది విభిన్నంగా ఉంటుందని, సినిమా చూస్తున్నంత సేపు బయటి ప్రపంచాన్ని మరచిపోతారని చెప్పింది. ఇష్టం కదా అనుకుంటే వరుసగా ఇలాంటి పాత్రలే వస్తున్నాయి, అందుకే కొంతకాలం దెయ్యం పాత్రకు దూరంగా ఉండాలని ఫీలవుతున్నట్లు తెలిపింది నందితా శ్వేత.

అందమైన పాత్ర...

'గ్లామర్​ పాత్రలు చేయడానికి వ్యతిరేకం కాదు. కానీ తెరపై నాయిక అందంగానే కనిపించాలి దాంతో పాటు పాత్రకీ ప్రాధాన్యం ఉండాలి. ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళ భాషలలో ప్రయాణం చేస్తున్నాను. ‘ఒనంగ మాడి’ అనే తమిళ చిత్రంలో పబ్‌ సాంగ్‌లో ఆడి పాడా. కేవలం షో కేసులో బొమ్మలా ఉండే పాత్రలు చేయమంటే మాత్రం అంగీకరించలేనంటూ 'వెల్లడించింది నందిత. ఈ కథానాయిక పంచుకున్న మరిన్ని విశేషాలు మీకోసం..

ఐపీసీ 346, అక్షర చిత్రాల్లో నందిత
  1. ఇప్పటి వరకూ 23 చిత్రాల్లో నటించినా.... ప్రతి పాత్రలోనూ ఏదో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ‘ఐపీసీ 376’ అనే తమిళ చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటించా. అందులో పోరాటాలూ చేశా.
  2. తెలుగులో ‘అక్షర’ సినిమాలో నటించా. నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. ‘కల్కి’లో ఓ ముస్లిం యువతిగా చేస్తున్నాను. కమర్షియల్‌ సినిమాలైనా సరే విభిన్నతకే ప్రాధాన్యమిస్తున్నాను.
  3. ఇప్పుడు తమిళంలో 3 చిత్రాలు, కన్నడలో ఒకటి సెట్స్‌పై ఉన్నాయి. తెలుగులో కొత్తవేవీ ఒప్పుకోలేదంటూ తను చేస్తోన్న సినిమాలపై క్లారిటీ ఇచ్చింది నందిత.

'ప్రేమ కథా చిత్రమ్​ 2' హరికిషన్​ దర్శకత్వంలో తెరకెక్కగా సుదర్శన్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.

ABOUT THE AUTHOR

...view details