సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ప్రేమకథా చిత్రం 2'. హరి కిషన్‌దర్శకత్వం వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది.
దెయ్యంతో ప్రేమకథ - nanditha swetha
హర్రర్ కామెడీ నేపథ్యంలో వస్తోన్న ప్రేమకథా చిత్రం-2 ట్రైలర్ నెట్టింట సందడి చేస్తోంది.
దెయ్యంగా భయపెట్టేందుకు సిద్ధమవుతున్న నందితా శ్వేత
హర్రర్ కామెడీతో వచ్చిన పార్టు-1 "ప్రేమకథా చిత్రం" ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'ప్రేమకథా చిత్రమ్-2' తెరకెక్కించారు. కేవలం ఒక ఇంటిలో దెయ్యం, దాని పగ.. ఈ నేపథ్యంలో సినిమా మొత్తం ఉంటుంది. మొదటి భాగంలానే పార్టు-2 లోనూ హాస్యంపైనే ప్రధానంగా దృష్టి సారించాడు దర్శకుడు. జీవన్‌బాబు సంగీతమందించారు. ఈనెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.