తమిళ దర్శకుడు సి.ప్రేమ్ కుమార్... 'గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారాని'కి ఎంపికయ్యారు. తమిళంలో ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన 96 సినిమాకు దర్శకుడు ఈయన.
96దర్శకుడికి గొల్లపూడి అవార్డు - gollapudi srinivas award
96 సినిమాతో తమిళంలో ఘనవిజయం అందుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్... 'గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు'కు ఎంపికయ్యారు.
![96దర్శకుడికి గొల్లపూడి అవార్డు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2723313-305-ba5b5267-78a9-45f8-b635-b2137fe1fa66.jpg)
ప్రేమ్ కుమార్
గొల్లపూడి శ్రీనివాస్ స్మారకంగా 1997 నుంచి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ ఏడాది కూడా పలు దేశాల నుంచి నామినేషన్లు రాగా ప్రేమ్ కుమార్ విజేతగా నిలిచినట్లు అవార్డు కమిటీ తెలిపింది.
ఈ పురస్కార ప్రదానోత్సవం ఆగష్టు 12న జరగనుంది. తమిళ 96 చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో ప్రస్తుతం శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.