బాలీవుడ్ స్టార్ ప్రీతి జింతా (Preity zinta children), ఫైనాన్షియల్ ఎనలిస్ట్ జీన్ గుడ్ఇనఫ్ దంపతులు కవలపిల్లలకు తల్లిదండ్రులయ్యారు. సరోగసీ విధానం ద్వారా ఓ పుత్రుడు, పుత్రిక జన్మించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ప్రీతి. తమ సంతానానికి జై, జియా అనే పేర్లు పెట్టినట్లు తెలిపింది.
"మాకు చాలా సంతోషంగా ఉంది. జై జింటా గుడ్ ఇనఫ్, జియా జింటా గుడ్ ఇనఫ్ కవలలను మా కుటుంబంలోకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం." అని ట్విట్టర్లో పేర్కొంది ప్రీతి. మెడికల్ బృందానికి, సరోగసి విధానంతో గర్భం దాల్చిన మహిళకు ధన్యవాదాలు తెలిపింది.