తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎంతో నవ్వుకున్నా.. చాలా బాధపడ్డా' - సాయితేజ్

సాయితేజ్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రతిరోజూ పండగే. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది..

prathiroju
సాయితేజ్, రాశీఖన్నా

By

Published : Dec 23, 2019, 5:46 AM IST

"మారుతి ప్రతి చిత్రానికి ఒక ఫార్ములా ఉంటుంది. సినిమా ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు అని చెప్తే ఏమో అనుకున్నా. కానీ, థియేటర్లో చూస్తుంటే ప్రేక్షకులు పడి పడి నవ్వుతుంటే నిజమే కదా అనిపించింది" అన్నాడు దర్శకుడు సుకుమార్‌. సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వం వహించాడు. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. అల్లు అరవింద్‌ సమర్పించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సుకుమార్‌ మాట్లాడాడు.

"కొత్త తరంలోని మాటలు, భావోద్వేగాలు, ఆలోచనలు మారుతిలో ఉంటాయి. అవే ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. తన చిత్రాల్లోని ప్రతి పాత్రకు ఓ క్యారెక్టర్‌ ఉంటుంది. ఈ చిత్రం చూస్తున్నంత సేపు నవ్వా.. బాధ పడ్డా.. విజ్ఞానాన్ని నేర్చుకున్నా. నవ్విస్తూ భావోద్వేగాలు పండించడం చాలా కష్టం. దాన్ని సాయితేజ్‌ అద్భుతంగా చేసి చూపించాడు. చిరు, పవన్‌ ఇద్దరు మేనమామల పోలికలు తేజులో కనిపిస్తాయి. తను మెగా ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్‌ రిప్రసెంటేటర్‌. రాశీ చిత్రసీమకు మంచి ఆప్షన్‌ అయిపోయింది. ఈ చిత్రంలో రావు రమేష్‌ అన్ని రకాల భావోద్వేగాలు పలికించారు. బన్ని వాసుకు మనుషుల సైకాలజీ బాగా తెలుసు. అందుకే కథల విషయంలో మంచి జడ్జిమెంట్‌ చూపిస్తూ వరుస విజయాలు అందుకుంటూ ఉంటాడు."
-సుకుమార్, దర్శకుడు.

సాయితేజ్, రాశీఖన్నా

"ప్రతిరోజూ పండగే నిజంగా మాకు పండగ లాంటి చిత్రం. నిజానికిది ఏడుపు సినిమా.. కానీ, అందరూ బాగా నవ్వించానంటున్నారు. థియేటర్లో సినిమా చూశాక నవ్వుల డోస్‌ ఇంకా పెంచితే బాగుండనిపించింది. సత్యరాజ్, రావు రమేష్‌ల స్క్రీన్‌ స్పేస్‌ను అంగీకరించి సాయితేజ్‌ కథను నమ్మినందుకు చాలా థ్యాంక్స్‌. ముందు నుంచీ మేం కథనే నమ్మాం. అనుకున్నట్లుగానే అందరికీ చేరువయ్యింది. ఇరవై నాలుగు విభాగాల కష్టమే ఈ చిత్ర విజయానికి కారణం. సినిమా చూసి చిరంజీవి, రాఘవేంద్రరావు, శివ నిర్వాణ తదితరులంతా ఎంతో ప్రశంసించడం సంతోషాన్నిచ్చింది. నాకిలాంటి అవకాశమిచ్చిన అల్లు అరవింద్‌ సర్‌కి థ్యాంక్స్‌. ఆయన, సుకుమార్‌ వల్లే ఈరోజు మేమిక్కడ ఉన్నాం."
-మారుతి, దర్శకుడు

"నాకిది చాలా ముఖ్యమైన చిత్రం. మూడేళ్లుగా సరైన విజయాలు లేవు. ఇక నా పని అయిపోయిందనుకున్నా. చాలా మంది అస్సోంకి టికెట్‌ బుక్‌ చేసుకున్నావా అని నవ్వుకునే వాళ్లు. ఇలాంటి తరుణంలో ఇంత చక్కటి మెసేజ్‌ ఉన్న కథ ఇచ్చారు మారుతి. సత్యరాజ్‌ చిత్రానికి మూల స్తంభంలా నిలిచారు. ఆయనలో మా తాతను చూసుకున్నా. అందుకే తెరపై ఆయనతో అంత బాగా నటించగలిగా. రావు రమేష్‌తో నాది హ్యాట్రిక్‌ హిట్‌ కాంబినేషన్‌. మేమిద్దరం ఇంతకు ముందు చేసిన 'పిల్లా నువ్వులేని జీవితం', 'చిత్రలహరి' మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడాయన నాకొక సెంటిమెంట్‌ అయిపోయారు. రాశీ నాకు మంచి స్నేహితురాలు. ఇంతకుముందు 'సుప్రీం'తో తనని బెల్లం శ్రీదేవి అన్నారు. ఇప్పుడీ చిత్రంతో ఏంజెల్‌ ఆర్నా అంటున్నారు. ఈ చిత్ర విజయాన్ని నా కుటుంబం సభ్యులు, చిత్రబృందం, ప్రేక్షకులు ప్రతిఒక్కరికీ అంకితమిస్తున్నా."
-సాయిధరమ్‌ తేజ్‌, హీరో

ఇవీ చూడండి..అల్లు అర్జున్ డబ్బింగ్ షురూ చేశాడట..!

ABOUT THE AUTHOR

...view details