మెగా మేనల్లుడుసాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకుడు. జీఏ2 సంస్థ నిర్మిస్తోంది. బన్నీ వాస్ నిర్మాత. డిసెంబరు 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తేజూ, రాశీలపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నాడు. శ్రీజో సాహిత్యం అందించాడు. ఈ పాటతో చిత్రీకరణ పూర్తవుతుంది.
పాట చిత్రీకరణలో 'ప్రతిరోజూ పండగే' - prathiroju pandage
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. ప్రస్తుతం హీరోయిన్ రాశిఖన్నా, తేజూలపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు.
సాయి
"కుటుంబ నేపథ్యంలో సాగే చిత్రమిది. సాయితేజ్‌కు తాతయ్యగా సత్యరాజ్ కనిపిస్తాడు. తాతామనవళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. పాటలన్నీ రంగుల హరివిల్లులా ఉంటాయి. ఇప్పటివరకూ విడుదలైన రెండు గీతాలకూ చక్కటి స్పందన వస్తోంది" అని చిత్రబృందం తెలిపింది.
ఇవీ చూడండి.. మ్యూజియంలో విజయ్ 'బొమ్మ' అదుర్స్