తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాహీరో సాయితేజ్​ కెరీర్​లోనే తొలిసారి - entertainment news

హీరో సాయితేజ్​ 'ప్రతిరోజూ పండగే'.. ఇప్పటివరకు రూ.40 కోట్ల మేర గ్రాస్ సాధించింది. ఈ కథానాయకుడి కెరీర్​లోనే ఈ వసూళ్లే అత్యుత్తమం.

మెగాహీరో సాయితేజ్​ కెరీర్​లోనే తొలిసారి
మెగాహీరో సాయిధరమ్ తేజ్

By

Published : Dec 27, 2019, 7:21 PM IST

మెగాహీరో సాయితేజ్‌కు ఈ ఏడాది చాలా ప్రత్యేకమనే చెప్పాలి. గతేడాది వరకు ఈ కథానాయకుడ్ని వరుసగా పరాజయాలే పలకరించాయి. ఈ సంవత్సరం వాటికి ఓ పుల్‌స్టాప్‌ పెట్టాడు. కొత్త గెటప్‌తో, విభిన్న కాన్సెప్ట్‌తో 'చిత్రలహరి' సినిమాను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. కథ, కథనం అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆ తరువాత 'ప్రతిరోజూ పండగే' అంటూ వచ్చాడు. ఈనెల 20న వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

తాత-మనవడు మధ్య ఉండే అనుబంధాలకు ఈ సినిమాలో ఆవిష్కరించారు. కుటుంబ ప్రేక్షకులను మెపిస్తోందీ చిత్రం. తేజ్‌ కెరీర్‌లోనే అతి పెద్ద విజయం నమోదు చేసింది. ఇప్పటి వరకు రూ.40 కోట్ల గ్రాస్‌ షేర్‌ వసూలు చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది.

రూ.40 కోట్లు వసూలు చేసిన 'ప్రతిరోజూ పండగే' సినిమా

ఈ సినిమాలో రాశీఖన్నా.. ఏంజల్‌ ఆర్నాగా నవ్వులు పూయిస్తోంది. సత్యరాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతమందించాడు.

ఇది చదవండి: మెగాహీరో సాయితేజ్​కు డిగ్రీలోనే​ ప్రేమ'కథ'లు

ABOUT THE AUTHOR

...view details