తెలంగాణ

telangana

ETV Bharat / sitara

hanuman: టాలీవుడ్​ తొలి సూపర్ హీరో చిత్రం - hanuman Superhero Film in Telugu

విభిన్న చిత్రాలతో అలరిస్తోన్న ప్రశాంత్ వర్మ మరో కొత్త సినిమాతో ముందుకొస్తున్నారు. టాలీవుడ్​లోనే తొలి సూపర్​ హీరో నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుంది. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్​ మోషన్ పోస్టర్​ను విడుదల చేశారు.

hanuman
హనుమాన్

By

Published : May 29, 2021, 9:27 AM IST

Updated : May 29, 2021, 9:40 AM IST

విభిన్న కథా చిత్రాలతో సత్తాచాటుతున్నారు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇటీవలే 'జాంబీరెడ్డి'తో హిట్ అందుకున్న ఆయన తాజాగా మరో కొత్త మూవీ ప్రకటించారు. దీనిని మరో కొత్త జోనర్​లో తెరకెక్కించనున్నారు. 'హనుమాన్' అనే టైటిల్​తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే తొలి సూపర్​హీరోగా సినిమాగా నిలవబోతుందని తెలిపారు.

ఈరోజు (మే29) ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. అదిరిపోయే బ్యాక్​గ్రౌండ్, విజువల్స్​తో ఆకట్టుకుంటోందీ పోస్టర్. హీరోహీరోయిన్లు, సాంకేతిక బృందం తదితర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Last Updated : May 29, 2021, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details