'కేజీఎఫ్' వంటి భారీ యాక్షన్ డ్రామా చిత్రంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పుడాయన ఈ చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగాన్ని ముస్తాబు చేసే పనిలో బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే ఇది తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే తర్వాతి చిత్రం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ప్రశాంత్.
అప్పుడే అడ్వాన్స్ తీసేసుకున్నారా! - ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా
'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోందట. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రశాంత్‌కు మైత్రీ సంస్థ అడ్వాన్స్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఓ సినిమా చేసేందుకు అంగీకారం కుదుర్చుకున్నట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీళ్ల కలయికలో ఎన్టీఆర్ కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ముస్తాబు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే మైత్రీ సంస్థ ప్రశాంత్‌కు రూ.2కోట్లు అడ్వాన్సు ముట్టజెప్పినట్లు వార్తలొస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది 2022లో సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఈలోపు ఎన్టీఆర్.. రాజమౌళి, త్రివిక్రమ్‌ల చిత్రాలు పూర్తి చేయనున్నారు.