ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నారు. అయితే తారక్ పుట్టినరోజు సందర్భంగా మరో చిత్రంపైనా క్లారిటీ వచ్చినట్లయింది.
'కేజీఎఫ్' దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్! - Prashanth Neel Wishes NTR
'ఆర్ఆర్ఆర్' తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఈ చిత్రం తర్వాత మూవీపై కూడా ఈరోజు క్లారిటీ వచ్చినట్లయింది. తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ ట్వీట్ చేశారు. దీనిని బట్టి వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.
'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే నీల్, తారక్‌కు కథ కూడా వినిపించేశాడని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పటికే ప్రశాంత్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చేసిందట. ఈ వార్తలన్నింటికీ బలం చేకూరుస్తూ ఈరోజు యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ విషెష్ తెలిపారు. అందులోని సారాంశం ప్రకారం వీరిద్దరి మధ్య సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
"న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఫైనల్‌గా నాకు తెలిసింది. నీ చుట్టూ ఉండే క్రేజీ ఎనర్జీకి మళ్లీ వచ్చినపుడు నా రేడియేషన్ సూట్ తీసుకువస్తా. త్వరలోనే కలుద్దాం. హ్యాపీ బర్త్‌డే బ్రదర్" అంటూ ట్వీట్ చేశాడు ప్రశాంత్.