తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సలార్' అర్థం చెప్పిన ప్రశాంత్ నీల్ - Prabhas Prashanth Neel

డార్లింగ్ ప్రభాస్​తో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్' అనే చిత్రం చేయబోతున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఆ టైటిల్​కు అర్థం ఏంటని చాలామంది ఆలోచిస్తున్నారు. తాజాగా ఈ టైటిల్​కు అర్థం ఏంటో చెప్పారు దర్శకుడు ప్రశాంత్.

Prashanth Neel about Salaar meaning
'సలార్' అర్థం చెప్పిన ప్రశాంత్ నీల్

By

Published : Dec 4, 2020, 1:39 PM IST

'బాహుబలి' చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా పేరు పొందారు నటుడు ప్రభాస్‌. ఇటీవలే ఆయన 'కేజీఎఫ్‌' దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో 'సలార్‌' చిత్రాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్యర్యానికి గురి చేశారు. 'సలార్‌' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూసి సినీ ప్రేమికులు సర్‌ప్రైజ్‌ అవడమే కాకుండా టైటిల్‌కు అర్థమేమిటా? అనే ఆలోచనలోపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. టైటిల్‌ గురించి, ప్రభాస్‌ని మెయిన్‌లీడ్‌గా తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించారు.

"ఉగ్రం', 'కేజీఎఫ్‌' చిత్రాలతో కన్నడ చిత్రపరిశ్రమలో పేరు తెచ్చుకున్నా. ఇక్కడ ఉన్న హీరోలను కాకుండా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రభాస్‌ని హీరోగా తీసుకోవడం గురించి చాలామంది అడుగుతున్నారు. నేను రాసుకున్న 'సలార్‌' కథకు ప్రభాస్‌ సరిగ్గా సరిపోతాడని నాకు అనిపించింది. అందుకే ఆయనతో ఈ సినిమా చేస్తున్నా. మిగతా విషయాలు సినిమా విడుదలయ్యాక మాట్లాడతాను"

సలార్

"సలార్‌' టైటిల్‌కు ఎంతోమంది ఎన్నోరకాల అర్థాలు చెబుతున్నారు. అది ఒక సామాన్యమైన పదం. ఉర్దూ భాష ప్రకారం 'సలార్‌' అంటే సమర్థవంతమైన నాయకుడు అని అర్థం. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. ఓ వైలెంట్‌ పాత్రను మీ ముందుకు తీసుకురానున్నా. కథకు అద్దంపట్టేలా ఫస్ట్‌లుక్‌ తీర్చిదిద్దాం. ప్రభాస్‌ లుక్‌ చూసి ఆయన ఆర్మీలో ఉండే వ్యక్తి అని అందరూ అనుకుంటారనే ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను టైటిల్‌తో విడుదల చేశాం" అని ప్రశాంత్‌ నీల్‌ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details