అద్భుత దృశ్యమాలిక 'రామాయణ్'.. దూరదర్శన్ ఛానెల్లో మరోసారి ప్రసారమవుతూ ఎన్నో ఘనతల్ని సాధిస్తోంది. ప్రపంచ రికార్డుల్ని కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సీరియల్ ప్రసారం చేసేముందు ఎదురైన అనుభవాల్ని తాజాగా పంచుకున్నారు ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్ వెంపటి. ఈ సీరియల్‌ను పున:ప్రసారం చేయమని ప్రధాన మోదీ ఆదేశించగానే తన వాట్సప్ గ్రూప్‌లో సందేశాలు వెల్లువెత్తాయని తెలిపారు.
"కొందరు ఈ నిర్ణయాన్ని మెచ్చుకోగా.. మరికొందరు నవ్వారు. ఇప్పుడు ఈ సీరియల్‌ను ఎవరు చూస్తారు అంటూ జోక్‌లు వేశారు. కానీ నేను ఒకటే చెప్పా. 'భారత్ భిన్న దేశం. ఎక్కువ జనాభాతో పాటు వైవిధ్యమూ ఉంటుంది. అందువల్ల బాధపడాల్సిన అవసరం లేదు' అని స్పష్టం చేశా."