దక్షిణాది భాషల్లో నటిగా రాణిస్తున్న స్నేహ.. ఈరోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు ప్రసన్న.. సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, ఓ ఫొటోను పంచుకున్నాడు. పలువురు సెలబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
స్నేహకు ఆడబిడ్డ.. ఏంజిల్ వచ్చిందంటూ పోస్ట్ - Sneha Prasanna girl baby
నటి స్నేహ.. ఈరోజు(శుక్రవారం) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త ప్రసన్న సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

ప్రసన్న-స్నేహ
ప్రసన్న-స్నేహలకు 2012లో వివాహమైంది. వీరికి విహాన్(5) అనే కుమారుడు ఉన్నాడు. స్నేహ... చివరగా తెలుగులో రామ్చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. ఇటీవలే వచ్చిన ధనుష్ 'పటాస్'తో ప్రేక్షకులను పలకరించింది.
దక్షిణాదిలో స్నేహ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 'శ్రీరామదాసు', 'వెంకీ', 'సంక్రాంతి', 'ప్రియమైన నీకు' లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ప్రసన్నతో వివాహం తర్వాత హీరోయిన్ పాత్రలకు స్వస్తి చెప్పిన ఈమె.. ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది.
Last Updated : Feb 18, 2020, 6:16 AM IST