టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా 'జెర్సీ'. 'ప్రపంచమే అలా..నిద్రలో ఉందిగా' అంటూ సాగే ఈ సినిమాలోని లిరికల్ పాట విడుదలైంది. వినసొంపుగా ఉన్న ఈ గీతం సంగీత ప్రియుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయింది.
'ప్రపంచమే అలా... నవ్వేమో మేలుకుంది ఇలా' - టాలీవుడ్ హీరో నాని
టాలీవుడ్ హీరో నాని నటించిన 'జెర్సీ' సినిమాలోని మరో లిరికల్ పాట విడుదలైంది. చక్కని సాహిత్యంతో అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉందీ గీతం.
!['ప్రపంచమే అలా... నవ్వేమో మేలుకుంది ఇలా'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2949304-thumbnail-3x2-nani.jpg)
జెర్సీ సినిమా నుంచి విడుదలైన మరో లిరికల్ పాట
అనిరుధ్ రవిచందర్ సంగీతమందించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్ చిత్రంపై అంచనాల్ని పెంచాయి. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. 36 ఏళ్ల రంజీ క్రికెటర్ పాత్రలో నాని కనిపించనున్నాడు. పూర్తిస్థాయి క్రీడా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 19న థియేటర్లలో సందడి చేయనుందీ చిత్రం.
ఇవీ చదవండి: